నేడు (శుక్రవారం) హైదరాబాద్ కి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన విషయం తెలిసిందే.విభజన హామీలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు,ఇతర కీలక అంశాల పై చర్చకి రావాలని లేఖలో పేర్కొన్నారు.శనివారం జూన్ 06న భేటీ కావాలని తెలపడంతో ప్రజాభవన్ లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ కి రానున్నారు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు.మరోవైపు ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కి వస్తుండడంతో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుండి బంజారాహిల్స్ లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు స్వాగత ర్యాలీ కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు వెల్లడించారు.ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని,ఇచ్చిన సమయం లోగ ర్యాలీ ముగించాలని టీడీపీ శ్రేణులకు పోలీసులు సూచించారు.