- మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
- డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్ యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.అనంతరం రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.దేవకాద్రాలో రూ.610 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి,మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత అధికారులు,ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పూర్తీ చేయాలనీ ఆదేశించారు.