Sunday, September 7, 2025
spot_img

నీట్ పేపర్ లీకేజి కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సీబీఐ

Must Read

దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో పలుపురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.మరోవైపు నీట్ లీకేజి పై 38 మంది విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు నీట్ పేపర్ లీకేజి జరిగినట్టు స్పస్టంగా అర్థం అవుతుందని వెల్లడించింది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This