- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన ” నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య” కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో ఉన్న అన్ని కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ విధానం తెలవాలని పేర్కొన్నారు.ఈ విద్య సంవత్సరం నుంచే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు.నిరుద్యోగులను తయారు చేసేలా కళాశాలలు ఉండకూడని అభిప్రాయపడ్డారు.ఫార్మా,ఐటి తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపిస్తుందని, అందుకు కళాశాలల్లో ఏఐకి సంభందించిన కోర్సును తీసుకురావాలని వెల్లడించారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీను ఏర్పాటు చేసి అటానమస్ హోదా కూడా కల్పిస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు.