జమ్మూకశ్మీర్ దోడా జిల్లాలో భరద్వాలో జరిగిన ఎన్ కౌంటర్ కు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.గత రాత్రి దోడాలో జమ్మూకశ్మీర్ పోలీసులు,సాయుధ బలగాలు తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు తప్పుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన బలగాలు వారి పై కాల్పులు జరిపారు.ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు సిబ్బంది మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మరోవైపు జులై 09న కతువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కూడా 10 రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన ఓ మేజర్ తో పాటు,మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.ఈ ఘటనకు కూడా తామే బాధ్యులమని కాశ్మీర్ టైగర్స్ ప్రకటించింది.తాజాగా జరిగిన ఘటనలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.