రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన ఆదేశాలిచ్చారు.రైతుల కోసం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో మల్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రుణమాఫీ రేషన్ కార్డు నిభందన పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పస్టత ఇచ్చారు.భూమి పాస్ బుక్ ఆధారంగానే రైతుల కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని,కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం రేషన్ కార్డు నిబంధన అని తెలిపారు.