- మైనార్టీ గురుకులలో అవకతవకలు
- ప్రమోషన్లు, బదిలీల్లో అర్హులకు అన్యాయం
- సీసీఏ రూల్స్ 34, 35 పక్కకు పెట్టిన కార్యదర్శి
- రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీతో ప్రమోషన్ లిస్టు
- ఫిమేల్ ఎంప్లాయిస్ ని బాయ్స్ స్కూల్ కు బలవంతంగా అలార్ట్
- ప్రమోషన్స్ లో ముందుంటారని అబద్ధపు వాగ్ధానాలు
- హెడ్ ఆఫీస్ లోని అధికారుల అవగాహన రాహిత్యం వల్లే నష్టపోయాం
- న్యాయం చేయాలంటూ మైనార్టీ గురుకుల టీచర్ల డిమాండ్
తెలంగాణలో జరుగుతున్న బదిలీలు, ప్రమోషన్లతో ఉద్యోగులు పరేషాన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మైనార్టీ గురుకులాల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి హైకోర్టుకు వెళ్తే అక్కడ స్టే తెచ్చుకున్నా లాభం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. కోర్టు ఆర్డర్ ను సైతం మైనార్టీ గురుకుల సెక్రటరీ లెక్కచేయకపోవడం గమనార్హం. టీఎంఆర్ఈఐఎస్ లో అపాయింట్మెంట్ సమయంలో మెరిట్ లో ఉన్న ఫిమేల్ ఎంప్లాయిస్ ని తమ అభిప్రాయం అడగకుండానే జనరల్ కేటగిరి పేరుతో బాయ్స్ గురుకుల స్కూల్స్ అలర్ట్ చేశారని… నాడు దీనిపై ఉన్నత అధికారులని అడిగితే ప్రమోషన్లలో మీరే ముందుంటారని మాయమాటలు చెప్పి తమను బలవంతంగా బాయ్స్ స్కూల్స్ కి పంపారని టీచర్లు మండిపడుతున్నారు.
నిబంధనలు పాటించట్లే :
మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్టేట్ సబార్డినేట్ (సీసీఏ) రూల్స్ 34 , 35 పక్కకు పెట్టిందని అంటున్నారు. సీసీఏ రూల్స్ కి వ్యతిరేకంగా సీనియార్టీ లిస్టులో ప్రమోషన్ లిస్టులో ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ లో పనిచేసే అడ్మిన్ డిపార్ట్మెంట్ వారు డిప్యూటేషన్ పై వచ్చారని… వారికి గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ మీద ఎలాంటి అవగాహన లేని వారితో చేయించడం వల్ల అన్ని తప్పుల తడకగా జరుగుతున్నాయని టీచర్లు వివరించారు.
హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయలే :
మైనార్టీ గురుకులాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు, బదిలీలు, ప్రమోషన్లలో తమకు అన్యాయం జరుగుతుందని కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు శుక్రవారం నాడు (12వ తారీఖు) ట్రాన్స్ ఫర్స్ ప్రమోషన్లు ఆపాలని మూడు స్టేలు ఇచ్చింది. అయినా కానీ టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఏదీ ఏమైనా ట్రాన్స్ ఫర్స్ చేయాల్సిందేనని ఆఫీసులో పనిచేసే వాళ్ళను అర్ధరాత్రి వరకు ఉంచుకొని కార్యదర్శి లిస్ట్ లు తయారు చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ట్రాన్స్ ఫర్స్ ల పేర్లతో అందర్నీ ఇబ్బంది పెడుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
తాము మెరిట్ లో ఉండి కూడా నష్టపోతున్నామని… మెరిట్ లో ఉన్న ఫిమేల్ టీచర్లని ట్రాన్స్ ఫర్స్ లలో గర్ల్స్, బాయ్స్ స్కూల్ అని చూపించాలని కోరుతున్నారు. ఇటీవల జరిగిన ట్రాన్స్ ఫర్స్ వెబ్ ఆప్షన్ లో 26 మెంబర్స్ కి ఏ స్కూల్స్ పనిచేస్తున్నారు అదే స్కూల్స్ కి అలర్ట్ చేసినట్లు చెబుతున్నారు. మొన్న పెట్టిన వెబ్ ఆప్షన్ లో అన్ని స్కూల్స్ చూపించడం లేదని, కేవలం కొన్ని మాత్రమే చూపిస్తున్నాయని అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరున వెబ్ ఆప్షన్లు డిస్ప్లే చేస్తుండడం, నామమాత్రంగా 20 నుండి 30 స్కూల్స్ చూపిస్తున్నా అవి కూడా 100 నుండి 200 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూలు మాత్రమే ఉన్నట్లు టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
మైనార్టీ గురుకుల సెక్రటరీ కక్షకట్టి తమపై ఇలా చేస్తుందని తమకు న్యాయం చేయాలని, నిబంధనల ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు జరిగేలా చూడాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.