డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఆగష్టు 28 కి వాయిదా వేసింది.అభ్యర్థుల తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది రవిచందర్,గత కొన్ని రోజుల నుండి పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.పరీక్షకు 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారని వెల్లడించారు.నాలుగు నెలల వ్యవధిలోనే నిరుద్యోగులు అనేక పరీక్షలు రాశారని పేర్కొన్నారు.మరోవైపు పిటిషన్ దాఖలు చేసిన నిరుద్యోగులు పరీక్షకి అప్లై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది.గ్రూప్ 01 పరీక్షతో పాటు డిఎస్సి పరీక్షకు కూడా అప్లై చేశారని నిరుద్యోగుల తరుపు న్యాయవాది వెల్లడించారు.పిటిషన్ వేసిన పదిమంది ఎందుకు తమ హాల్ టికెట్స్ సమర్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది.హాల్ టికెట్స్ సమర్పించకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.తదుపరి విచారణ ఆగష్టు 28 కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.మరోవైపు నేటి నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి.