Wednesday, December 4, 2024
spot_img

ముందు నిర్మాణం,తర్వాత పర్మిషన్

Must Read

( కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజ మల్లయ్య )

  • దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం
  • అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్
  • పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90శాతం నిర్మాణం
  • మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు
  • ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన హెచ్ఎండీఏ
  • చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం
  • సీడీఎంఏ కమిషనర్ ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుండి తొల‌గించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌

‘ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్నట్టుగా రాష్ట్రంలో మున్సిపల్ అధికారుల పనితీరు తయారైంది. తెలంగాణలో ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ న్యాయంగా డ్యూటీ చేయడం లేదనేది జగమెరిగిన సత్యం. అదీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావొచ్చు.. మొన్న వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లో అయినా సరే.. అంతా మొద్దు నిద్రలోనే తూగుతున్నారు. లక్షలు లక్షలు జీతం తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్లు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పనిచేయలేక పోవడం శోచనీయం. గవర్నమెంట్ దాదాపు అన్ని శాఖల అధికారులు ఇట్లనే ఉన్నప్పటికీ మున్సిపల్ శాఖలో కాస్త ఎక్కువే ఉన్నదని చెప్పాలి. ప్రభుత్వ ఆస్తులను కాపాడలేకపోవడం, అక్రమార్కులను అడ్డుకోలేకపోవడం, రూల్స్ విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్న సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యామేంటనేది తెలుసు.మాముళ్లకు తలొగ్గి ఎట్లాంటి వాటికైనా సై అంటున్నారు.నాది కాదు,నా అత్త గారు సొమ్ము నాకేంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.నౌకరు వచ్చేంతవరకు ఒకలా,ఆ తర్వాత మరోలా..’నదీ దాటేదాక ఓడ మల్లన్న..నదీ దాటినంక బోడ మల్లన్న’ అన్న చందంగా అధికారుల పనితీరు ఉండడం గమనార్హం.

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. దమ్మాయిగూడలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపాలిటీలో నిర్మాణాలు చేపడుతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. దమ్మాయిగూడ సర్వే నంబర్ 464లో ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపడుతున్నా కూడా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మున్సిపాలిటీకి కూత వేటు దూరంలో ఉన్న ఈ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.అధికారులు మాముళ్లు తీసుకోవడం వల్లనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్కూల్ నిర్మాణానికి అనుమతులు లేవు :కమిషనర్ రాజ మల్లయ్య

సర్వే నంబర్ 464లో చేపడుతున్న స్కూల్ నిర్మాణానికి మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కమిషనర్ రాజ మల్లయ్య స్పష్టం చేశారు. నిర్మాణదారులు హె‌చ్‌ఎండీఎకు దరఖాస్తు చేసుకున్నారట, అనుమతులు వస్తాయంటా అని కమిషనర్ తెలుపడం గమనార్హం. కానీ స్కూల్ భవన నిర్మాణం కోసం హెచ్ఎండిఏకి దరఖాస్తు చేసుకోగా, హెచ్ఎండీఏ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు.

హెచ్ఎండిఏ దరఖాస్తును తిరస్కరించడంతో అక్రమార్కులు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల సంపూర్ణ సహకారాలతో నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇకకైనా కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఆదాయాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS