Friday, November 22, 2024
spot_img

డీఎస్ఈ లో’ తిష్ట‌వేసిన త్రిమూర్తులు

Must Read
  • ముప్పై ఏండ్ల పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లోనే మ‌కాం
  • ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు భేఖాతర్
  • డీఎస్ఈలో తిష్ట రాయుళ్లు చెప్పిందే వేదం
  • కిందిస్థాయి ఉద్యోగులను ఘోస పెట్టించుకుంటున్న వైనం
  • ప్రమోషన్లు, బదిలీలు చేయించడంలో సిద్ధహస్తులు
  • యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు శూన్యం

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో పెద్ద తలకాయల‌దే రాజ్యం.. వాళ్లు చెప్పిందే వేదం.. త్రిమూర్తులు తిష్టవేసి కూర్చున్నారు. మూడు దశాబ్ధాలుగా ముగ్గురు అధికారులు డీఎస్ఈలో పెత్తనం చెలాయిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖను అవినీతి, అక్రమాలకు అడ్డాగా మార్చారు. ప్రభుత్వాలు మారిన కానీ, పాలకులతో అంటకాగుతూ అదే స్థానంలో కొనసాగుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏళ్లుగా అక్కడే ఉంటూ కిందిస్థాయి ఉద్యోగులను ఘోసపెట్టించుకున్నారు. తెలంగాణలో కొన్నేండ్లుగా ఉద్యోగుల్లో బదిలీలు లేక ఎక్కడివారు అక్కడే పాతుకుపోయారు. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్స్ చేసేందుకు పూనుకుంది. కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో మాత్రం ఆ జీఓ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది.

డీఎస్ఈలో ద‌క్షిణ‌మూర్తి (ఏడీ -ఎస్టాబిల్ష్‌మెంట్), పూర్ణ‌చంద‌ర్ రావు (అస్టిసెంట్ డైరెక్ట‌ర్),స‌త్య‌నారాయ‌ణ (అసిస్టెంట్ డైరెక్ట‌ర్)గా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు దాదాపు ముప్పై ఏండ్లు సంవ‌త్స‌రాల పై బ‌డి అక్క‌డే పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇన్నాళ్లు ఒకచోట మకాం వేసి కూర్చున్నారు. చాలా కాలంగా ఒకేచోట పనిచేసిన వీరినీ బదిలీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ఎంఎస్‌. నెం 80 తేది 3-7-2024 ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ఉల్లంఘించింది. అసిస్టెంట్ డైరెక్టర్ బదిలీల విషయంలో క్లియర్ గా ఉన్న ఖాళీలు మినహాయించి, వేరే సమాచారం ఇవ్వ‌కుండా ఆప్షన్‌లు తీసుకోవ‌డం శోచ‌నీయం.

‘నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను’ అన్న చందంగా డీఎస్ఈలో కొందరూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ, ఏ పోస్టు అనే వివరాలు వెల్లడిస్తే ఎవరైనా బదిలీలు ఈజీగా కోరుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేడర్ స్ట్రెన్తు, స్టేషన్ సీనియారిటీ, తప్పనిసరి బదిలీలు అయ్యోవారి జాబితాను ఉద్యోగులకి తెలియజేసిన తర్వాతే ఆప్షన్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇవేవీ చేయకుండనే ఆప్షన్‌లు తీసుకోవడంలో ఆంతర్యామేంటో తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ ఫర్స్ కు అవకాశం ఇచ్చినప్పటికి కొందరు ఆఫీసర్ల వల్ల బదిలీలు కోరుకునే సదరు ఉద్యోగులలో అదీ సాధ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది.

ముప్పై సంవత్సరాలుగ డైరెక్ట‌ర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేష‌న్ లోనే తిష్టవేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.పూర్ణచందర్ రావు అధికారులను తప్పు దారిపట్టిస్తున్నాడు. ‘పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు’ అన్న చందంగా ఇతగాడి తీరు ఉన్నది. గ‌తంలో అప్పటి గవర్నమెంట్ 317 ప్ర‌కారం బ‌దిలీలు ప్ర‌క్రియ చేప‌ట్టిన సంగతి తెలిసిందే. కానీ డీఎస్ఈలో అవినీతి, అక్రమాలకు అలవాటు పడ్డ ఈ అధికారులు ఆ జాబితాలో వారి పేర్లు రాలేదు. ఆ టైంలో కూడా ఉన్న‌తాధికారుల‌ను మ‌భ్య‌పెట్టి ట్రాన్స్ ఫర్స్ లిస్ట్ లో లేకుండా చేసుకున్నారు. తన కేడర్ బదిలీలు తనే పర్యవేక్షించడం వల్ల అవకతవకలకు పాల్పడుతున్నాడు. జూనియ‌ర్ అసిస్టెంట్‌ నుండి మొదలు సీనియ‌ర్ అసిస్టెంట్, సూరింటెండెంట్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కూడా అనగా 30 ఏళ్లైనా ఇంకా డీఎస్ఈలోనే తిష్ట వేశారు. డైరెక్ట‌ర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేష‌న్‌లో సీనియార్టీతో ఉన్న వారు బ‌దిలీ కాకుండా తోటి మ‌హిళా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఉద్యోగులను జిల్లాల‌కు పంపించి ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారు. గవర్నమెంట్ ఉత్త‌ర్వుల‌ను పాటించకుండా ఈ ముగ్గురు తిష్ట‌ రాయుళ్లు వారికి న‌చ్చిన విధంగా ఉంటున్నారు.

ఇంకా ఇక్కడే ఉండేలా కుట్రలు:
డీఎస్ఈలో అలవాటు పడ్డ పూర్ణచందర్ రావు ఎటూ వెళ్లి పనిచేయడం ఇష్టం లేక మరోసారి బదిలీ కాకుండా ఇక్కడే ఉద్యోగం ఎలగబెట్టాలని కుట్రలు చేస్తున్నాడు. ఆయన భార్య హైద‌రాబాద్ జిల్లాలో ప్ర‌భుత్వ కార్యాల‌యంలో విధులు నిర్వ‌ర్తిస్తారు. త‌న భ‌ర్త పేరు చెప్పి స్పౌజ్ తో గ‌త కొన్నేళ్లుగా ఇక్క‌డే తిష్ణ వేశారు. ఒకసారి భార్య స్పౌజ్ వినియోగించుకున్నప్పటికి ఆధారాలను గోల్మాల్ చేసి మళ్ళీ తను స్పౌజ్ ఉపయోగించుకునే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎం.పూర్ణచందర్ రావుతోపాటు కె.సత్యనారాయణ తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ యూనియ‌న్ (టిజిఓ)లో బాధ్యతలు వెలగబెడుతున్నారు. ఏ ఒక్క రోజూ ఉద్యోగుల బాగోగుల కోసం పనిచేయలేదు. కానీ సంఘం సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇక్క‌డే మకాం వేసేలా సారు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

అలాగే సుదీర్ఘ కాలంగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయములో పని చేస్తున్నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ జిల్లాలకు బదిలీ చేసి ఇలాంటి స్వార్ధపరులకి తగిన గుణపాఠం చెప్పాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ‌దిలీల వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుత డైరెక్ట‌ర్ ఆఫ్ ఎడ్యూకేష‌న్ సంచాల‌కులు దృష్టి సారించి, అర్హులైన వారికి న్యాయం చేయాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు..

Latest News

ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS