- నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది
- త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది
- ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే
- మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం
- పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది
- “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం ప్రజాభవన్ లో నిర్వహించిన “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని,త్యాగాల పునాదుల పై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత,అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించామని గుర్తుచేశారు.గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని వెల్లడించారు.యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ లో మార్పులు చేశామని తెలిపారు.నిరుద్యోగులు ఇబ్బందులను గుర్తించి,వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేశామని,కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే అని అన్నారు.పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.ఉద్యోగాల భర్తీ కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెడుతున్నామని,ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను తెప్పించుకుంటామని స్పష్టం చేశారు.జూన్ 02లోగా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 09లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.