Sunday, November 10, 2024
spot_img

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Must Read

  • తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలను
    ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం
  • ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్,ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్,ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్,ఫార్మసీని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,డ్రైవర్లు,కండక్టర్లకు,డిపోలో పనిచేసే సిబ్బందికు నాణ్యమైన మరియు ఉచిత వైద్యం అందించాలనే సంకల్పం,వారి ఆరోగ్య భద్రత కోసం సిటీ స్కాన్,ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఇతర సదుపాయాలను ప్రారంభించామని తెలిపారు.రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అని వెల్లడించారు.కాసేపు వైద్యులు,అధికారులతో కలిసి ఆసుప్రతిను సందర్శించారు.చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ముచ్చటించి,వారికీ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం వైద్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశయ్యారు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, సంస్థ ఉన్నతాధికారులు,వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS