జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ లు,బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి,బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి,సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు,ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు.