- విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం
- విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది
- విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు
- సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు,యాదాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ జరుగుతుందని వెల్లడించారు.విద్యుత్ అంశంలో బీఆర్ఎస్ నాయకులే విచారణ చేపట్టాలని కోరారని,ఇప్పుడు విచారణ చేపడుతుంటే వారే వద్దు అంటున్నారని తెలిపారు.విద్యుత్ కమిషన్ ముందు మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు.