Friday, September 20, 2024
spot_img

జన్మ ధన్యమైంది,రైతులకు లక్షన్నర రుణమాఫీ

Must Read
  • రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • 07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ
  • రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం
  • రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి

లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.ప్రభుత్వం.రెండో దఫాలో భాగంగా 07 లక్షల మందికి రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేసింది.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీతో లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం నెలకొందని,జన్మ ధన్యమైందని హర్షం వ్యక్తం చేశారు.రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రైతు ప్రయోజనమే ముఖ్యమని స్పష్టం చేశారు.కార్పొరేట్ సంస్థలు బ్యాంకులను మోసం చేస్తున్నాయని,గత పదేళ్లలో రూ. 14 లక్షల కోట్ల ఎగవేశాయని వెల్లడించారు.పంటల సాగుకోసం బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులను కట్టలేక రైతు ఇబ్బందులు పడుతున్నారని,అందుకే వారిని అదుకునేందుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు.ఏ రైతు కూడా ఆర్థిక పరిస్థితిలతో ఇబ్బందులు పడొద్దు ఇదే మా విధానం,అందుకే ఈ రోజు రైతులకు లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This