Sunday, November 24, 2024
spot_img

పట్టణ ప్రణాళికాలో అవినీతి తిమింగలం..?

Must Read
  • అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు
  • టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు
  • ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్
  • సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్
  • అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు

ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు అనవసరం.. ప్రభుత్వం అంటే భయం లేదు.. నియమ నిబంధనలు అంటే లెక్కేలేదు.. తనకు సపోర్ట్ చేస్తున్న ఉన్నతాధికారుల అండ చూసుకుని పేట్రేగిపోతున్న అవినీతి తిమింగలం కథా, కమామీషు ఇప్పుడు చూద్దాం..

తమ ఇష్టానుసారం దొంగలకు సద్ది కట్టి కోట్లకు పడగలెత్తిన పట్టణ ప్రణాళికా అధికారుల చరిత్ర ఇది.. వీరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తే పూర్తి వివరాలు బయటికి వస్తాయి.. ఒక బాధ్యతగలిగిన ఫోర్త్ ఎస్టేట్ గా పూర్తి ఆధారాలను, ఫైల్ నెంబర్లను పొందుపరిచి వార్తలు రాశాము.. దీనిపై అడిషనల్ సి.సి.పీ. ప్రదీప్ కుమార్ ఏమన్నారు అంటే, మహా అయితే ఏం చేస్తారులే.. కోర్టులో చూసుకుంటాం.. ఎన్నో కేసులయ్యాయి.. ఎవరేం చేయలేరు.. లక్షలు పారేస్తే కోర్టులో ఆర్డర్లు నాకు ఫేవర్ గా వస్తాయి.. అని దురుసుగా వ్యవహరించిన తీరు గర్హనీయం.. ఈ అధికారికి పైస్థాయిలో పనిచేసే ఉన్నతాధికారుల సపోర్ట్ ఎంత ఉందో రాష్ట్రం, ప్రభుత్వ పెద్ద అయినా సీఎం గారు దృష్టి సారించాలి అని మేధావులు కోరుతున్నారు.

జిహెచ్ఎంసి అడిషనల్ సి.సి.పి, ప్రదీప్ కుమార్ అక్రమ పద్ధతిలో ఇచ్చిన నిర్మాణ అనుమతులు.. ఆక్యుపెన్సి సర్టిఫికెట్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఎల్బీనగర్ నియోజకవర్గం, ఈస్ట్ జోన్ జిహెచ్ఎంసి పరిధి, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో, మన్సూరాబాద్ పెద్ద చెరువు కింద ప్రమాదకరంగా ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
ఈ అవినీతి బాగోతంలో టౌన్ ప్లానింగ్ భాగస్వామ్యం అధికారిని శ్రావణి, అడిషనల్ సిసిపి ప్రదీప్ కుమార్ ముఖ్యులు కావడం విశేషం.

పర్మిషన్ నెంబర్ :

1.ఫైల్ నెంబర్ : 005510/జీహెచ్ఎంసి / 2763/ ఎల్.బీ.ఎన్ /2022 – బీపీ..
పర్మిట్ నెంబర్ : 2891/జీహెచ్ఎంసి / ఎల్.బీ.ఎన్ /2022 – బీపీ..

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నెంబర్ :

అప్లికేషన్ నెంబర్ : 005074 / జీహెచ్ఎంసి / 2531/ ఎల్.బీ.ఎన్ 1/2023 – ఓసీ.
ప్రొసీడింగ్స్ నెంబర్ : 3592 / జీహెచ్ఎంసి / ఎల్.బీ.ఎన్ 2023 – ఓసీ.

అన్నీ అతిక్రమణలే :

అడిషనల్ సిసిపి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. అన్నీ అతిక్రమిస్తూ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేశారు. స్కూల్ భవన నిర్మాణ పరిధి ప్రాంతాల నుండి నాలా వెళ్తుంది. వాస్తవానికి ప్రాథమికంగా అక్కడ రోడ్డు లేదు. కానీ, నాలాపైన స్లాబ్ వేసి, ఆ స్లాబ్ పరిసర ప్రాంతాన్ని రోడ్డుగా చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు ఎలా ఇస్తారు అనేది ప్రశ్న. ఈ ప్రాథమిక పాఠశాల 1 నుండి 8 తరగతి వరకు నిర్వహించే స్కూల్ ను ఉద్దేశించి తగు పర్మిషన్ జారీ చేశారు. అదేవిధంగా ఈ పాఠశాల బిల్డింగ్ నిర్మాణానికి 30 ఫీట్ల రోడ్డు ఉండాలి.. కానీ రోడ్డు మాత్రం లేదు.. ఎదురుగా ఉన్న నాలాను రోడ్డుగా చూపించి ఎలా అనుమతులు జారీ చేస్తారు అనే సందేహం తలెత్తుతుంది. ఇక గతంలో స్థానికంగా నివాసం ఉండే కాలనీ ప్రజలు నాలా ఆక్రమణలపై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపు ప్రాథమిక స్కూల్ అంటూ నిర్మాణ అనుమతులు తీసుకుని దీంట్లో హైస్కూల్ వరకు విద్యాబోధన చేస్తుండడం గమనార్హం.

ఇదీలా ఉండగా మాన్సూరాబాద్ చిన్న చెరువులో, ఓపెన్ స్పేస్ లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణంలో కూడా నారాయణ జూనియర్ కాలేజ్ విద్యాసంస్థ నిర్వహిస్తున్నారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

2) ఫైల్ నెంబర్ : 001152 / జీహెచ్ఎంసి / 0562 / ఎల్.బీ.ఎన్ 1/2023 – బీపీ..
పర్మిట్ నెంబర్ : 0508 / జీ హెచ్ ఎం సి / ఎల్. బీ.ఎన్ / 2023 – బీపీ..

మరో దాంట్లో కూడా పట్టణ ప్రణాళిక అధికారుల డొల్లతనం, అవినీతికి పాల్పడ్డారనడం ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ నారాయణ జూనియర్ కళాశాలకు సంబంధించిన నిర్మాణాలు మున్సిపల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా కట్టడం జరిగింది. మున్సిపల్ ఆక్ట్ కు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో నిర్మాణం చేపట్టడంపై అనేక అనుమానాలు లేకపోలేదు.

‘జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల’ అన్నట్టు ఇలాంటి బిల్డింగ్ లు కట్టడానికి సహకరించింది పట్టణ ప్రణాళిక అధికారులు కాదంటారా.. ఇన్ని అవకతవకలు, అక్రమాలు ఉన్నా నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికేట్, ఓసి సర్టిఫికెట్ ఎలా ఇచ్చారనేది ప్రశ్న. వాళ్లు ఏం చేసుకుంటే మాకేంది మా జేబులు నిండుతే చాలులే అన్నట్టు ఆలోచించి అయినా నిబంధనలకు విరుద్ధంగా.. భారీ ముడుపులకు అమ్ముడుపోయి, పట్టణ ప్రణాళిక అధికారులు ఆక్యుపెన్సి, ఓసి సర్టిఫికెట్ ఇచ్చారనేది జగమెరిగిన సత్యం.

ఈ అవినీతిపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఏసీబీ, ఇతర నిఘా విభాగాలు దృష్టి సారించి, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత క్లుప్తంగా అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసినంకా అయినా ప్రభుత్వం నిద్రలోంచి మేల్కొంటుదా లేదా..

అడిషనల్ సి.సిపి ప్రదీప్ కుమార్ అవినీతిపై మరికొన్ని ఆధారాలతో మరో సంచికలో

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS