హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది.బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య ముదిరిన వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,శనివారం ఎల్బీనగర్ లోని భరత్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళల మధ్య బట్టలు ఆరేసే విషయంలో వివాదం చెలరేగింది.మాట మాట పెరిగి గొడవ పెద్దగా అవ్వడంతో బుజ్జి అనే మహిళా సోదరుడు కమలమ్మ సోదరుడు శంకర్ పై కత్తితో దాడి చేశాడు.దింతో ఒక్కసారిగా శంకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.గమనించిన కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.