తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.