- కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
- బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం
- కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి
- దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు
- షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలి
- పాస్ పోర్ట్ అప్పగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- 166 రోజులపాటు తీహార్ జైలులోనే కవిత
- నేడు జైలు నుండి విడుదలయ్యే అవకాశం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది.
కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారని తెలిపారు.ఫోన్లు మార్చడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు.దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి డబ్బును రికవరీ చేయలేదని,493మంది సాక్షులను విచారించారని వెల్లడించారు.సాక్షులను బెదిరించారని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి..కానీ ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదని తెలిపారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందన్న ముకుల్ రోహాత్గి,సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు కూడా వర్తిస్తాయి అని తన వాదన వినిపించారు.
దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు,ఫోన్లో ఉన్న డేటాను కవిత ఫార్మాట్ చేశారని,ఆధారాలుసాక్ష్యాలు మాయం చేశారని తెలిపారు.కవిత దర్యాప్తుకు సహకరించడంలేదని పేర్కొన్నారు.ఫోన్లో డేటా ఎక్కువైతే డిలీట్ చేస్తారు కానీ,ఫార్మాట్ చేయరని అన్నారు.ఆధారాలను కవిత తారుమారు చేశారు,ఇలాంటి సందర్భంలో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు.
రెండువైపులా వాదనలు విన్న ధర్మాసనం,కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.రూ.10 లక్షల విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.సాక్షులను ప్రభావితం చేయొద్దని,పాస్ పోర్టును అప్పగించాలని తెలిపింది.నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని..అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని పేర్కొంది.మహిళకు ఉన్న హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ చేసింది.అనంతరం కవితకు ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.అప్పటినుండి 166రోజుల పాటు కవిత జైలులోనే ఉన్నారు.ఈరోజు సాయంత్రం,లేదా రేపు కవిత హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.