Sunday, November 24, 2024
spot_img

బీసీ డిమాండ్ల సాధనకై అఖిలపక్ష సమావేశం

Must Read
  • రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి
  • స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే
  • అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతో
    ప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి
  • రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు వేయకపోవడం,ఇది బీసీల వ్యతిరేక చర్య అని రాజ్యసభ సభ్యుడు,జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.గురువారం హైదరాబాద్ లో లక్డికాపుల్ లోని సెంట్రల్ కోర్ట్ హోటల్ లో బీసీ డిమాండ్ల సాధనకై అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అఖిలపక్ష,రాజకీయ,బీసి,కుల,ప్రజా సంఘాల ప్రముఖ ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ,బీసీ డిమాండ్ల సాధనకై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.డిమాండ్ల సాధనకై నెలల తరబడి ఉద్యమం చేస్తున్నప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల నిరసనను వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణం ఇది కాదని మండిపడ్డారు.ఎన్నికలకు మందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి,ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏంటని నిలదీశారు.కులగణన ఉద్యమంకు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఒక నిబద్దత కలిగిన నాయకుడిగా ముందుకెళ్తున్నారని,కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులగణన అంశంలో పూర్తి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని విమర్శించారు.కులగణన నిమిత్తం ప్రభుత్వం జి.ఓ.26ను విడుదల చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మెజారిటీ ప్రజాలైన బీసీల డిమాండ్లను పరిష్కరించలనే సోయి కూడా లేకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.న్యాయ పరమైన తమ డిమాండ్ల సాధనకు దశల వారిగా ఉద్యమాలను ఉధృతం
చేస్తామని ప్రకటించారు.రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.ఎల్ లాల్ కృష్ణ ఈ సమావేశానికి సభాద్యక్షులుగా ఉన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు వి.హన్మంత రావు,ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూధన చారి,ఎల్.రమణ,తీన్మార్ మల్లన్న కూడా పాల్గొన్నారు.వీరితో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ,నాయకులు గుజ్జ సత్యం,అంజి,ప్రొఫెసర్ భాగయ్య,రామలింగం,గొడిగె మల్లేష్ యాదవ్,రాజారం యాదవ్,గాదె సమ్మయ్య,ఎం.ఎన్ మూర్తి,రాజ్ కుమార్, రామ్ కోటి,దాన కర్నాచారి,సామ్యుల్ తో పాటు తదితర 50 బీసి కుల సంఘాలు,ప్రజా సంఘాలు,మహిళా సంఘాలు పాల్గొన్నాయి.

వకుళాభరణం కృష్ణ మోహన్ ను చైర్మన్ గా కొనసాగించాలి :

అన్నీ నియమకలల్లో పార్టీ క్యాడర్ కు అవకాశం ఇవ్వడం వీలు కాదని,అన్నీ నియామకాలను రాజకీయ కోణంలో పరిశీలించడం తగదు అని అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది.రాజకీయాలకు అతీతంగా బీసీ కమిషన్ ఛైర్మన్,సభ్యుల నియామకం జరగాలని ఈ సమావేశంలో సూచించారు.నిబద్దత,అనుభవంతో కృషి చేస్తున్న వకుళాభరణం కృష్ణ మోహన్ ను చైర్మన్ గా కొనసాగించాలని అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

Latest News

నవంబర్ 26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఏంఏం) పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS