Friday, November 22, 2024
spot_img

మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి నిర్మాణ సంస్థ.. !

Must Read

(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..)

  • నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు..
  • మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
  • వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు..
  • ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
  • మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా అగని అక్రమ నిర్మాణ పనులు..
  • మునుత్ ట్రస్ట్ మహావీర్ జైయిన్ అస్తులంటూ ప్రభుత్వ స్థలాలకు ఎసరు..
  • అక్రమ నిర్మాణాన్ని తక్షణమే ఆపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని
    వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ సుధీర్ కీర్తి వ్యవహారంపై దృష్టి సారించాలి..
  • వీరి అక్రమాలకు చరమగీతం పాడాలని కోరుతున్న స్థానిక ప్రజలు..

వావ్ ఈ సంస్ధపేరు గోల్డెన్ కీ మిరాకి.. ఈ పేరు వినగానే అందరికీ ఒక మిరాకిల్ కలిగించే ప్లాట్లు, నివాస స్థలాలు దొరుకుతాయేమో..? తమ లైఫ్ కూడా మిరాకిల్ గా మారుతుందేమో అనుకుంటూ పప్పులో కాలు వేస్తారు.. సంస్థ చూపించే అరచేతిలో స్వర్గం లాంటి దృశ్యాలను చూసి మైమరచిపోతారు.. కానీ ఈ సంస్థ ఎదుగుతున్న వైనం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. ఈ సంస్థ మిరాకిల్ చేస్తుంది.. ప్రభుత్వ భూములను, ఖాళీ స్థలాలను కాజేయడంలో.. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లలో గల భూములను కాజేస్తారు.. పొరబాటున ఆస్థలాలను, అక్కడి నివాస నిర్మాణాలను కొనుగోలు చేశామా.. ఇక జీవితంలో గోల్డెన్ అనే మాట వినిపించదు.. కేవలం గోల్ మాల్ తప్ప.. ఒకసారి చూద్దాం అసలు ఏమి జరుగుతోందో..?

సంగారెడ్డి జిల్లాలో, పటాన్ చెరు నియోజకవర్గంలో, అమీన్పూర్ మున్సిపాలిటీలో.. గోల్డెన్ కీ మిరాకి అనే నిర్మాణ సంస్థ పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారు కొందరు దగాకోరులు.. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 152,153 లకు సంబంధించిన చక్రపూరి కాలనీ లే ఔట్ లో ఖాళీ స్థలాలపై కన్నేశాడు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి.. ఇతగాడి డైరెక్షన్ లో 1981,1982 కు సంబంధించి 1985 సంవత్సరంలో చేసిన అప్రూవల్ లే అవుట్ కు సంబంధించిన ఓరిజినల్ లింక్ డాక్యుమెంట్ పక్కా ప్రణాళిక వేసి పోయినట్లు అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో 2021 అక్టోబర్ నెలలో పిర్యాదు చేయడం.. నాటి అధికారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని అక్రమంగా సర్టిఫికెట్ పొందడం జరిగింది.. మునూత్ ప్రైవేట్ ట్రస్టుకు సంబంధించిన మహావీర్ జైయిన్.. సదరు సర్టిఫికెట్ తో గూడెం మధుసూదన్ రెడ్డి చక్రపురి కాలనీ లే ఔట్ ఖాళీ స్థలాలను కబ్జా చేయుటకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కబ్జాకోర్లు..
పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతగాడి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి పేరిట కబ్జాలకు పాల్పడటంతో పాటు, వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

గోల్డెన్ కీ మిరాకిల్ పేరుతో వెంకట రమణ కాలని లే అవుట్ లో లే అవుట్ సృష్టించి, ప్రభుత్వ స్థలంతో పాటు పార్కు స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ను మేనేజ్ చేసుకుని, నకిలీ పత్రాలను సృష్టించి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కబ్జారాయుళ్లు.. వేల గజాల విస్తీర్ణంతో కూడిన ప్లాట్లు ఉన్నట్లు ప్లాట్ నెంబర్లకు బై నెంబర్ల వేసి, దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. గత ప్రభుత్వంలో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న చందాన అధికారం అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు కొట్టేశాడు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి.. ఇతగాడికి బినామిగా ఉన్న సుధీర్ కీర్తి అనే వ్యక్తి పేరుతో గోల్డెన్ కీ మిరాకి అనే సంస్థ పేరుతో డాక్యుమెంట్ తయారు చేసి, సర్వే నెంబర్ 152లో ఉన్న ప్రభుత్వ, అసైండ్ స్థలాన్ని కాజేశారు ఈ కేటుగాళ్లు.. సదరు ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమి అన్నట్లుగా చిత్రీకరించి అక్రమంగా పొందిన అనుమతులతో యదేచ్చగా నిర్మాణ పనులు చేస్తూ.. సామాన్య ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు

వీరు..గూడెం మధుసూదన్ రెడ్డి ఈడి కేసులో విచారణ ఎదుర్కొంటూ ఇప్పటికే ఉన్న సదరు స్థలాలు అటాచ్ అయినా కానీ కబ్జాలకు పాల్పడిన స్థలాల్లో మాత్రం నిర్మాణాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు సంబంధిత హెచ్.ఎం.డి.ఏ., రెవెన్యూ అధికారులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ దృష్టి సారించి ప్రభుత్వ స్థలాలకు డాక్యుమెంట్లు సృష్టించిన మునుత్ ప్రైవేట్ ట్రస్టు మహావీర్ జైయిన్ అక్రమాలతో పాటు గోల్డెన్ కీ మిరాకి పేరుతో ప్రభుత్వ, పార్కు స్థలాలు కబ్జా చేస్తున్న వ్యవహారంపై విచారణ చేసి, అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ, పార్కు స్థలాలు కాపాడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.. చక్రపురి కాలని లే ఔట్ లో, వెంకటరమణ కాలని లే అవుట్ పేరిట చేస్తున్న కబ్జాల వ్యవహారానికి సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” .. ” మా అక్షరం అవినీతిపై అస్త్రం”..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS