భారీ వర్షాల వరద విధ్వంసంతో జనజీవనం ఛిద్రమైంది..ఈ వేళ బాధితులకు అండగా నిలవడం,సహాయం చేయడం సమిష్టి బాధ్యత..ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచిత
విమర్శల,అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోతుంది..వరద బీభత్సవానికి కారుకులెవరు..?
చెరువులు,నాళాలు,మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల కట్టడి చేయని లోపం
పాలకులదే కాదా.! కూర్చున్న కొమ్మనే నర్కొంటోన్న నోరు మెదపక పోవడం తిలాపాపం తల పిరికేడు కాదా..!
ఆపదలో మానవత్వం చాటాల్సిన చోట ” శవాల మీద పేలాలు ఏరుకునే” దౌర్భాగ్య బురద రాజకీయాలెందుకు..??
నిష్పక్షపాతంగా హైడ్రా అమలే తక్షణ పరిష్కార మార్గం..
- మేదాజి