పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప స్ఫూర్తి అని తెలిపారు.పారాలింపిక్స్ 2024లో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్స్,ప్లేయర్స్ అందరికీ ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.