- సీఎం రేవంత్ రెడ్డి
నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‌ల వద్ద ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‌ల నుండి వచ్చే డ్రైనేజ్ నీరును గండిపేటలో కలుపుతున్నారని తెలిపారు.చెరువులను ఆక్రమాణల నుంచి విడిపించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఆక్రమణలు చేసే వారు గౌరవంగా తప్పుకోవాలని హెచ్చరించారు.కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న,కోర్టులో కొట్లాడుతామని స్పష్టం చేశారు.మూసీ వెంట ఉన్న 11 వేల బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.