- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.రంగంలోకి దిగిన పోలీసులు ఆరేకపూడి గాంధీను అడ్డుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు.మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసం పై దాడి చేసినందుకు గాంధీ పై కేసు నమోదైంది.ఈ సంధర్బంగా పాడి కౌశిక్ మాట్లాడుతూ,కాంగ్రెస్ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని తెలిపారు.ప్లాన్ ప్రకారమే తన పై దాడి జరిగిందని,దాడులకు భయపడేది లేదన్నారు.ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీశారు.పోలీసులే దగ్గరుండి తనపై దాడి చేయించారని విమర్శించారు.