Sunday, November 24, 2024
spot_img

దేవరకొండలో విద్యావ్యవస్థను కాపాడండి కలెక్టర్‌ గారు

Must Read
  • బిల్డింగ్‌ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్‌కేర్‌
  • ప్రైవేట్‌ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం
  • దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్‌ ప్రోకో నిర్వహిస్తున్న తీరు
  • ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి
  • జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్‌ యజమాని
  • దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ మాతృ నాయక్‌
  • విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే పట్టించుకోని జిల్లా అధికారి

భవనం పూర్తి కాలేదు..స్కూల్‌కు పర్మిషన్‌ లేదు..అప్పుడే తరగతుల నిర్వహన దేవరకొండలో ప్రవేట్‌ విద్యాసంస్థలు ఎటు చూసినా నిర్లక్ష్యం ఫీజులతో పేద ప్రజలను పిడుస్తున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.అసంపూర్తిగా నిర్మించిన భవనాలు రూల్స్‌ బ్రేక్‌ చేసి ఇస్తానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్న తీరు.సమయపాలన పాటించని ప్రైవేట్‌ విద్యాసంస్థలు చెప్పాలంటే ఎన్నో ఉన్న వాటిని పట్టించుకునే అధికారి లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.జిల్లా కలెక్టర్‌ ఇప్పటికైనా దేవరకొండ నియోజకవర్గంలో జరుగుతున్న విద్యా వ్యవస్థ పై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు చదువుకున్న మేధావులు కోరుతున్నారు.లిటిల్‌ పవర్‌ అనే యాజమాన్యం తప్పు చేస్తే మరొక యజమాన్యం కలగజేసుకొని వాటిని కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి డబ్బులు పంచె కార్యక్రమాన్ని ముందుకేసుకొని వీలు కుదిరితే నాయనో బయానో ఇచ్చి వారిని పంపించడం లేదంటే మీ సంగతేంటో చెబుతానని బెదిరించడం చైతన్య పాఠశాల యజమాన్యం ప్రిన్సిపాల్‌ కే దక్కుతుంది.

లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలలో జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు పాఠశాల యజమాన్యంతో నేరుగా బీరసారాలు జరిపిన ఎంఈఓ మాతృ నాయక్‌ తీరుని అందరిని ఆశ్చర్యానికే గురిచేస్తుంది అని చెప్పాలి.ఎంఈఓ కార్యాలయం ముందే విద్యార్థి సంఘాలు జర్నలి స్టులు ఉన్న ఎవరున్నా నన్ను ఏం చేయలేరు అనే తీరుగా దురుసు గా ప్రవర్తిస్తూ ఎలాంటి పరిమితులు లేకున్నా పాఠశాలను నడిపిం చుకోవాలి. ఏమైనా ఉంటే పై అధికారులను నేను మేనేజ్‌ చేస్తాను అంటూ.విద్యార్థి సంఘాలను జర్నలిస్టులను బెదిరించసాగాడు.

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది‘ లిటిల్‌ ఫ్లవర్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ పరిస్థితి. స్కూల్‌ నిర్వహణ కోసం అద్దెకు తీసుకున్న బిల్డింగ్‌ పనులు పూర్తి కాకుండానే.. స్కూల్‌కు అనుమతులు తీసుకోకుండానే కొత్త బ్రాంచ్‌ లను ఓపెన్‌ చేస్తున్నాయి.పేరెంట్స్‌కు కట్టు కథలు చెప్పి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దేవరకొండ మండలం నూతన భవన్లో పాఠశాలకు అనుమతి రాకుండానే తరగతులు నిర్వహిస్తున్నారు.

లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ మోసం..

ఈ స్కూల్‌కి విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది.స్కూల్‌ నిర్వహణ కోసం భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.స్కూల్‌ నిర్వహకులు వాచ్‌ మెన్‌ రూమ్‌లో కార్యాలయం ఏర్పాటు చేయడం గమనార్హం.స్కూల్‌ భవనం ఇంకా నిర్మాణంలోనే ఉంది. స్కూల్‌కి పర్మిషన్‌ రాలేదు.ఏ ధైర్యంతో స్కూల్స్‌ అడ్మిషన్లు తీసుకుంటుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయచ్చనే లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ధైర్యం

అనుమతులు ఇలా..

కొత్తగా స్కూల్స్‌ని ఏర్పాటు చేయాలంటే ముందుగా తనిఖీ ఫీజు,డిపాజిట్‌ తదితరాలకు స్కూల్‌ ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి.ఫైర్‌ డిపార్ట్మెంట్‌ ఎన్‌ఎస్పీ, పోలీసుల క్లియరెన్స్‌, శానిటరీ సర్టిఫికెట్‌, స్కూల్‌ భవనం పటిష్టత సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.ఒకసారి అనుమతి పొందితే పదేళ్ల వరకు గడువు ఉంటుంది.విద్యా హక్కు చట్టం ప్రకారం గుర్తింపు లేని స్కూల్స్‌ యాజమాన్యానికి లక్షల్లో ఫైన్‌లు వేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంది.కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు అనుమతి లేని ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లకు వత్తాసు పలుకుతూ..ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమ దందాను చూసి చూడనట్లు వదిలేస్తూ.. రూ. లక్షల్లో సొంత జేబులను నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

దేవరకొండ నియోజకవర్గం అంతా ఇంతే..

విద్యాశాఖ అనుమతులు లేకుండానే జిల్లాలో పదుల సంఖ్యలో ప్రైవేట్‌ స్కూల్స్‌ నడుస్తున్నాయి. స్కూళ్లలో ఏదైనా సంఘటనలు జరిగితే తప్ప వీటి ప్రస్తావన ఎవరూ ఎత్తడం లేదు.సంఘటన జరిగినప్పుడే సమాచారం సేకరించే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకోవడం లేదు.కొన్ని స్కూల్స్‌ రెన్యూవల్‌ చేసుకోకపోగా, అనుమతులు లేకుండా లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ లాంటివి వందలాది స్కూల్స్‌ పుట్టుకొస్తున్నాయి.ఎంఈఓ మాతృనాయక్‌ నిర్లక్ష్యం వలనే దేవరకొండలో ఇలాంటి సంఘటనలు పునరావుత్తం అవుతున్నాయి.విద్యార్థి సంఘాల నాయకులు ఎంఈఓను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెపుతు ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యంనికి వత్తాసు పలుకుతూన్నారు. ఇలాంటి ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా దేవరకొండ నియోజకవర్గంలో విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి ఎంఈఓ మాతృ నాయకుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తీవ్రంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS