- సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో పిల్లలకు కుళ్లిన కురగాయాలతో భోజనం పెడితే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్టల్స్ లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టనివారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. విద్యార్థులు రాష్ట్ర భవిష్యత్తు అని, వారి కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే విద్యార్థులకు ఇచ్చే కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచామని గుర్తుచేశారు. బడ్జెట్ లో విద్యాశాఖకు 07 శాతానికి పైగా నిధులను కేటాయించమని పేర్కొన్నారు. విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు.