- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టూరిజం ప్లాజాలో అయిన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ప్రజలకు ఒరిగిందేమి లేదని, కెసిఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ఇంకా విడుదల చేయలేదని, హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీను కూడా అమలు చేయలేదని విమర్శించారు.