బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా మరణించారు.ఇదిలా ఉండగా మరణించిన వారిలో ఓ కిరణా దుకాణం యజమాని సైతం ఉన్నాడు.దింతో అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణామంటూ అయిన మిత్రుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దింతో షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు తార స్థాయికి చేరడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవి కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.రాజీనామా చేసిన తర్వాత నేరుగా ఆమె భారత్ కు చేరుకున్నరు.