78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..
కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!
స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..
కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..
ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..
పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!
పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!
అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలో దోబుచులాడుతున్నాయి..!
నిరుద్యోగం,పేదరికం,అత్యచారాలు,మతతత్వ శక్తుల ఆగడాలు నేటి ప్రభుత్వాలకు పెను సవాళ్లు విసురుతున్నాయి..
కుతంత్రాలు,హత్యలతో నా దేశం అట్టుడుకుతుంది..
వెలివాడలో ఉండి ఇంకా అంటరానితనం అనుభవిస్తున్న దేహాలు ఎన్నో..!
జాతీయ జెండాలను గుండెల్లో మోస్తున్న అభాగ్యులకు ఏనాడు నిలువ నీడ దొరుకుతుందో..!
పేదవాడు,మురికివాడలు లేని సమాజం ఉన్నప్పుడే దేశం పురోగతి సాధించినట్టు..!
- రమేష్ గాండ్ల