ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కేజ్రీవాల్ కి మరో 14 రోజులు జుడిషియల్ కస్టడీ విధిస్తూ శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.3రోజుల సీబీఐ కస్టడీ పూర్తవడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు.ఈ సంధర్బంగా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ బీజేపీ కేజ్రీవాల్ ని జైళ్లోనే ఉంచే ప్రయత్నం చేస్తుందని,వీటి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ,సీబీఐ ని వాడుకుంటుందని విమర్శించారు.