- జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్
- నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది
- సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు,థర్మల్ పవర్ ప్లాంట్ ల నిర్మాణం పై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ని రద్దు చేయాలని కేసీఆర్ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని,సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ విమర్శించారు.
ఈనేల 15న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి కేసీఆర్ 12 పేజీల లేఖ కూడా రాశారు.చట్టానికి విరుద్ధంగా విద్యుత్ కొనుగోలు పై విచారణ ప్రారంభించారంటూ జస్టిస్ నరసింహా కమిషన్ పై మండిపడ్డారు.విచారణ నుండి కమిషన్ వెంటనే వైదొలగలని కేసీఆర్ కోరారు.హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డికి ఆ అంశాల పై విచారణ చేపట్టే అర్హత లేదని ఆరోపించారు.
జస్టిస్ నరసింహా కమిషన్ ఇప్పటికే 25 మంది విద్యుత్ అధికారులను ప్రశ్నించింది.మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈనెల 15లోగా ఈ అంశంలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది.కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందించిన కేసీఆర్ బదులుగా ఈనెల 15న 12 పేజీల లేఖ రాశారు.