- విద్యాశాఖ కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నాయకులు
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
- లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,విద్యహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సంధర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు,కార్పొరేట్,ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షల్లో ఫీజులు చేస్తున్నయాజమాన్యాలపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.తెలంగాణలో ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాలల్లో బుక్స్,యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని,వెంటనే డీఈవో,ఎం.ఈ.వో అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.వెంటనే తము పొందుపర్చిన డిమాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్తత నెలకొంది.