ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.