- శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర
- రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ
- భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు
- రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని భద్రత బలగాలు భారీగా మోహరించాయి.డ్రోన్లు,సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.జమ్ము శ్రీనగర్ హైవే పై పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేస్తున్నారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులు జమ్ముకి చేరుకుంటున్నారు.అమర్నాథ్ యాత్ర తొలిరోజు బల్తాల్,పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీచేసినట్టు అధికారులు తెలిపారు.అమర్ నాథ్ యాత్ర కి వెళ్ళే భక్తులు తిరిగి సాయంత్రం 7లోగా బేస్ క్యాంప్ లోకి చేరుకోవాలని అధికారులు వెల్లడించారు.