-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ
- ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
- 06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే మాజీ స్పీకర్,బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాయకులు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు.గత రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ కొంతమంది నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కూడా అయ్యారు.ఎ సమస్య ఉన్న తన వద్దకు రావాలని నాయకులకు భరోసా ఇచ్చారు.ఇప్పటికే 05 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా హస్తం గూటికి చేరడంతో ఆ సంఖ్య 06కి చేరింది.