Friday, September 20, 2024
spot_img

అనురాగ్‌ యూనివర్సిటీ బరాబర్‌ కబ్జానే

Must Read
  • నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా..
  • సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్‌ లోనే
  • సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే
  • చెరువు బఫర్‌ జోన్‌లో కాలేజీ, హాస్టల్‌ నిర్మాణం
  • గతంలో అధికారులను బెదిరించి ఎన్‌ఓసీ తీసుకున్న వైనం
  • తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌
  • విలేజ్‌ మ్యాప్‌ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి
  • ఆదాబ్‌ చేతిలో మరిన్ని అక్రమాల వివరాలు..
  • బహిరంగ చర్చకు సిద్దమా..
  • పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి సవాల్‌..?

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరిగాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు మంత్రులు అందినకాడికి దోచుకున్నారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రైవేటు ల్యాండ్స్‌ ను కబ్జా చేసిన ఘనత గులాబీ లీడర్ల సొంతం. అందులో ఏ మాత్రం సందేహం లేదు. తమ పార్టీ అధికారంలో ఉందనే ధైర్యంతో ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నారు. మంత్రులు, ఇతర నేతల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చినయి. ఇటీవల ఏర్పడ్డ హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాచేసిన అక్రమార్కుల భరతం పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క కబ్జాకోరులకు భయం పుట్టుకొస్తుంది. హైదరాబాద్‌ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా రaలిపిస్తున్న విషయం తెషయం తెలిసిందే. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో రూల్స్‌ కు విరుద్ధంగా నిర్మించారంటూ మాదాపూర్‌లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంట్‌ను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 166 కట్టడాలను కూల్చివేసిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికార, విపక్ష అని తేడా లేకుండా కబ్జాదారులకు నోటీసులు ఇస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు అని చూడకుండా పెద్ద పెద్ద వాళ్ల ఇల్లు, ఫామ్‌ హౌస్‌ లను సైతం కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి నాదం చెరువును కబ్జాచేసి కట్టినట్లు తెలుస్తోంది. మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా ఘట్‌ కేసర్‌ మండలం వెంకటాపురం, నాదం చెరువు బఫర్‌ జోన్లలో అనురాగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ కాలేజీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెరువు బఫర్‌ జోన్లో పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి చెందిన అనురాగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ కాలేజీ నిర్మించారని ఇరిగేషన్‌ శాఖ అధికారులు కంప్లైంట్‌ ఇవ్వడంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంకటాపూర్‌ గ్రామంలోని సర్వే నెం. 796, 813లో కబ్జా చేసి అనురాగ్‌ యూనివర్సిటీ, నీలిమ మెడికల్‌ కాలేజీ నీలిమ ఆస్పత్రి అక్రమంగా నిర్మించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తనపై కుట్ర పూరితంగా చేస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తమది పట్టా భూమి అని, కాలేజీలకు చెందిన బిల్డింగ్‌ నిర్మాణాలకు పర్మిషన్‌ కూడా ఉందంటూ బుకాయిస్తున్నాడు. అయితే ఇదే అంశంపై తాజాగా ఓ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చాడు. వెంకటాపూర్‌ లోని నాదం చెరువు బఫర్‌ జోన్‌ లో కాలేజీ, హాస్టల్‌ నిర్మాణం చేసినట్టు విలేజ్‌ మ్యాప్‌ లో క్లీయర్‌ గా కనిపిస్తుంది. కానీ అదీ కరెక్ట్‌ కాదు అన్నట్టుగా మీడియాకు విడుదల చేసిన వివరాలు ఉన్నాయి. అదే విధంగా గతంలో అధికారులను బెదిరించి తన కాలేజీల కట్టడాలకు సంబంధించి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్‌ఓసీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆదాబ్‌ తో చర్చకు సిద్దమా :

మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా వెంకటాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 813, 796లోని కొంత భాగం నాదం చెరువు కబ్జా చేసి అనురాగ్‌ యూనివర్సిటీ సహా హాస్టల్‌ బిల్డింగ్‌ లు నిర్మించినట్టు క్లీయర్‌ గా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆదాబ్‌ హైదరాబాద్‌ వద్ద ఉన్నాయి. నాదం చెరువు బఫర్‌ జోన్లలోనే సర్వే నెం. 813, 796లోని కొంత భాగం ఉన్నట్టు ఆదాబ్‌ స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో చెరువును కబ్జాచేసి అక్రమ కట్టడాలు కట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా సర్వే నెం.796లోని కొంత భూమి ప్రైవేటు వ్యక్తులది పల్లా కబ్జా చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకోని రాజేశ్వర్‌ రెడ్డి కోట్లాది రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టి బిల్డింగ్‌ లు కట్టి కాలేజీ ఏర్పాటు చేసినట్లు అధికారులతో కలసి ఆదాబ్‌ నిరూపించడానికి రెడీ. కాంగ్రెస్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా హైడ్రాతో బెదిరిస్తుందంటున్న పల్లా అవినీతి బయట పెట్టేందుకు మేము సిద్ధం. నాదం చెరువు బఫర్‌ జోన్లో అనురాగ్‌ యూనివర్సిటీ భవనాలు ఉన్నాయనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయి.దీనిపై చర్చకు సిద్ధమైతే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రావాలంటూ ఆదాబ్‌ హైదరాబాద్‌ సవాల్‌ విసురుతుంది. ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాళ్లకు లంచాలు ఇచ్చి, బెదిరించి పర్మిషన్‌ (ఎన్‌ఓసీ) తీసుకొని కట్టిన అక్రమ నిర్మాణాలు సక్రమమై పోవని హెచ్చరిస్తుంది. అనురాగ్‌ యూనివర్సిటీ గ్రామ పంచాయితీకి చెల్లించే ఆస్తిపన్నులో కూడా భారీ ఎత్తున చేస్తున్న మోసాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌..

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This