కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో మృతుల సంఖ్య 291 కి చేరింది.మరో 200 ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.మరోవైపు ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.బురద తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.గత మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.వయనాడ్ లో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.తాజాగా శిథిలాల కింద ఉన్న మరో నలుగురిని సైన్యం కాపాడింది.శిథిలాల నుండి వారిని రక్షించి హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.శిథిలాల కింద ఉన్నవారి ప్రాణాలకు ముప్పు రాకుండా,సైన్యం అని జాగ్రత్తలు తీసుకుంటుంది.