ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల అయ్యారు. అనంతరం తన సీఎం పదవికి రాజీనామ చేశారు. దీంతో ఢిల్లీ నూతన సిఎంగా అతిశీ పేరును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు.