ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై కేంద్రమంత్రి బండిసంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.” కవితకు బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ,పార్టీ న్యాయవాదులకు అభినందనలు,అలుపెరగకుండా మీరు చేసిన కృషి చివరికి ఫలించింది..ఇది బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల సమిష్టి విజయం..బెయిల్ పై బీఆర్ఎస్ నేత బయటకు వస్తున్నారు..కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారు..కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్..బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం,కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం,నేరంలో పాలుపంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు..విలీనం మాట ముచ్చట పూర్తయింది..ఇక మిగిలింది అప్పగింతలే తరువాయి” అని వ్యాఖ్యనించారు.
బండిసంజయ్ వ్యాఖ్యల పై కేటీఆర్ కౌంటర్ :
బండిసంజయ్ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బండిసంజయ్ హోదాకు తగదు అని సూచించారు.బండిసంజయ్ చేసిన వ్యాఖ్యాలను కోర్టు గుర్తించి ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరారు.