Friday, November 22, 2024
spot_img

బీఆర్ఎస్ కి భారీ షాక్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం

Must Read
  • వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు
  • కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం
  • ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి
  • కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్
  • రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం
  • రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా :పోచారం

బీఆర్ఎస్ పార్టీ కి నేతలు గుడ్ బై చెప్తున్నారు.ఇప్పటికే అనేకమంది ముఖ్య నేతలు పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్,కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ తో కలిసి పోచారం నివాసానికి వెళ్లారు.అనంతరం పోచారంతో భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల పై చర్చించారు.కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పోచారం శ్రీనివాస్ తనయుడుతో భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానే ఇంటికి ఆహ్వానించినట్టు పోచారం తెలిపారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని,రేవంత్ రెడ్డి రైతు పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పోచారం తెలిపారు.రాజకీయంగా తాను ఏమి ఆశించడంలేదని వెల్లడించారు.రైతులు బాగుండడమే ముఖ్యమని,ప్రభుత్వానికి తనవంతుగా అన్ని సహాయ,సహకారాలు అందిస్తానని ఈ సందర్బంగా పోచారం శ్రీనివాస్ అన్నారు.తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైందని తెలిపారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS