జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,సీఎం యోగి అధిత్యనాథ్ పేర్లు ఉన్నాయి.మొత్తంగా 40మందితో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.