Tuesday, December 3, 2024
spot_img

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

Must Read
  • కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది
  • రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు .మంగళవారం సునీత రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఆషాద మాసం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.అనంతరం జిల్లాల నుండి తరలివచ్చిన మహిళా కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్లో బోనాలు తయారుచేసి భూ లక్ష్మమ్మ గుడి వరకు డప్పు వాయిద్యాల మధ్య శివశతులతో బోనాలు తీసుకెళ్లి వడి బియ్యం పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మహిళ చైర్మన్ లు బండ్రు శోభారాణి,కల్వ సుజాత,భవాని రెడ్డి,ఇందిరా రావు,మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ,స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి,టిపిసిసి అధికార ప్రతినిధులు జిల్లా ప్రెసిడెంట్స్ ఆర్ లక్ష్మి,జయమ్మ,అనురాధ,ఇందిరా ఎం లక్ష్మి వనిత,జ్ఞానేశ్వరి,సుజాత,కవిత,ఉషశ్రీ,సుజాత,శ్రీలత, పెంట రజిత,పుష్ప రెడ్డి,సుభాషిని శైలజ,శోభ జిలాని,రమాదేవి, కృపా రెడ్డి,బ్లాక్ ప్రెసిడెంట్స్,మండల ప్రెసిడెంట్లు డివిజన్ ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు విలేజి ప్రెసిడెంట్స్ పాల్గొన్నారు.

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS