ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మరియు విజయవంతమైన జట్టుకు మార్గనిర్దేశనం చేయబోతున్నాను అని పేర్కొన్నారు.జట్టులో ప్రతి ఒక్కరితో తనకు మంచి సంభందాలే ఉన్నాయని అన్నారు.జట్టులోని ప్రతి ఒక్కరికీ తన మద్దతు ఉంటుందని గంభీర్ తెలిపాడు.