తాము మహబూబ్నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవర్ని క్షమించమని అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కోసం కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.