మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218 రూపాయలు తగ్గింది.బంగారం,వెండి ధరల పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 06 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
వెండి ధరలు కూడా :
కేవలం బంగారం ధరలే కాకుండా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.బడ్జెట్ కంటే ముందు కేజీ ధర రూ.88,995 ఉండగా,బడ్జెట్ తర్వాత రూ.84,275 కు తగ్గింది.