Tuesday, September 2, 2025
spot_img

ఆజ్ కీ బాత్

జెండా పండుగ అంటే…

అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే తాత్కాలిక అంశం కాదు.. ప్రతినిత్యం ప్రజల గుండెల్లో వినిపించే శాశ్వత ఆశయం..!!జెండా రెపరెపలాటలో యోధుల పోరాటాలు, ఆశయ సాధనకై యువ భారత ఆరాటాలూ కనిపిస్తాయంటేఎంతటి పవిత్ర గలదో...

ఈ దేశంలో దొంగతనాలెన్నో…

ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతేవినాశనం తప్పదు.....

కలుషితం.. కలుషితం

గాలే కాదు.. నీరే కాదు.. మనసంత కలుషితం.. అంతరాత్మ అంతరాలు తరచిచూస్తేకలుషితం.. మాటే కలుషితం చూపే కలుషితం.. మౌనంలో దాగున్న భావమెంత కలుషితం.. ఆత్మ చంపి జీవించే మనుషుల్లో కల్మషం.. స్వార్ధమున్న మనసుంటే మనిషంతా కలుషితం.. ఆచరణే సాధ్యమవని మాటలన్నికలుషితం.. తీర్చలేని వరాలిస్తె ప్రజాస్వామ్య కలుషితం.. ఆట పాట లేకుంటే బాల్యమంత కలుషితం.. హింస...

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం మారదు కదా, ప్రజల మనసులు గెలవదు.తమ బిడ్డలను సర్కారీ బడికి పంపని నేతలు,తమ రోగానికి ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయించని అధికారులు,ఆదర్శంగా నిలవని పాలకులు ఉన్నచోట,సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం...

కుల రాజకీయాలు

కులమనే అస్త్రం, నాయకుల స్వార్థం,సమాజపు ఐక్యతకు పాతర వేయును.ఓట్ల వేటలో కులానికే పట్టం,అధికారం వచ్చాక, ప్రజల కడుపు మాడును.మాటలు కోటలు దాటును, చేతలు శూన్యం,అభివృద్ధిని మరిచి, కలహాలకు ఆజ్యం.వ్యక్తిగత లాభమే వారికి ముఖ్యం,దేశ సమైక్యతకు పెను ముప్పుగా మారును.కులాలకు అతీతంగా ఎదిగితేనే శ్రేయం,సమసమాజ స్థాపనే మనందరి ధ్యేయం.

నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..!

నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..!అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ అదే ప్రేరణ.. తెలంగాణ స్ఫురణ..!ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..!తీగలను దెంపి అగ్నిలోన దింపినావని..!దాశరథి పలికించిన.."రుద్రవీణ"..నిప్పు కణకణ..!డ్రాగన్నూ విడిచిపెట్టని దాశరథి కలం..!ఖబడ్దార్ చైనా..అంటూ చేసింది హైరానా..!!తిమిరంతో సమరం చేసిన కలం..!ఉరకలెత్తిస్తే ధ్వజమెత్తిన ప్రజ..!అంతటి నిజామూ గజగజ..!! సురేష్ బేతా

అవనికి అభిషేకం .. వాన ధారలు

అవనికి అభిషేకం .. వాన ధారలుమండుటెండను మనసులోన దాచుకున్నదిమరిగి భాష్పవాయువై మిన్నంటుకున్నదిపరిసరాలకు ప్రాణ వాయువు పంచుతున్నదిఅవసరానికి గొంతు తడిని తీర్చుతున్నదిమేఘమై సుడిగాలిలో ఉరుములే తన పిలుపులైవనములే హారతులుగా మెరుపు తీగలధారమైవానధారలు అవనికే అభిషేకమన్నది…పుడమి తల్లికి పురుడు పోసి కల్పతరువై కాలచక్రం తిప్పుతున్నది అందెల రవళి

రైతుకు ఆశ తీర‌నున్న‌దా..?

"దుక్కి" ఎండిపోతున్నది.."మొలక”.. మొఖం మాడిపోతున్నది.!నీరు లేక “నారు మడి.. నోరు తెరుచుకుంటున్నది..!!"కాలం" కన్నెర్రజేసి..చినుకు రాల్చనంటున్నది..!ముందు మురిపించిన “వానా” ఇప్పుడు..ముఖం చాటేస్తున్నది..!! "పొడి గాలే" వడివడిగా..వీచుకుంటు వెళ్తున్నది! "దూదిపింజలా"మబ్బు తెప్పు..నింగిన కదిలిపోతున్నది..!! ఏపుగ ఎదగాల్సిన "పైరు”.."ఎండి" మెండిగ కన్పిస్తున్నది…! "అన్నదాత" ముఖాన..ఇప్పుడు ఆందోళన నెలకొన్నది..!! కాలం "కరుణ” కొరకు.."కర్షక - లోకం" ఎదురు చూస్తున్నది..! కరువు...

14వ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు

నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న‌ మీ కృషి ప్రశంసనీయం..మీ వాక్యాలు వెలుగులు నింపాలి.. మీ విలువలు మార్గదర్శనం కావాలి..మీ కలం ప్రజల గొంతుక‌వ్వాలి.. మీ దిశ ప్రజాస్వామ్యానికి పటముగా నిల‌వాలి..ప్రజల బలహీన స్వరం మీ పేజీలపై బలమైన శబ్దంగా మారాలి..మీ ప్రశ్నలు.. పాలకులకు జవాబు అడిగే ధైర్యానికి ప్రతీకవ్వాలిమీ 14 ఏళ్ల ప్ర‌యాణం ప్రజాస్వామ్యానికి...

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన ‘ఆదాబ్ హైద‌రాబాద్’ కు14వ వార్షికోత్సవం సందర్భంగా..హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆదాబ్ ప్రేమికుడు
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS