- 25 మంది మంత్రులకు శాఖలు కేటాయింపు
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు
- డిప్యూటీ సీఎంతో పాటు మరో నాలుగు శాఖల కేటాయింపు
- హోం మంత్రిగా అనిత వంగలపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు.ఈ నెల 12న ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.చంద్రబాబుతో పాటు మంత్రులుగా జనసేన అధినేత పవన్, టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేష్ తో 24మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు.మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియను పూర్తీ చేసి శాఖలు కేటాయించారు.జనసేన అధినేత పవన్, లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఎవరెవరికి ఏ శాఖలు :
1) పవన్ కళ్యాణ్ – డిప్యూటీ సీఎం,పంచాయితీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,అటవీ,
పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు
2) నారా లోకేష్ – మానవ వనరుల అభివృద్ధి,ఐటి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు.
3) అచ్చెన్నానాయుడు – వ్యవసాయ శాఖ మంత్రి
4)నాదెండ్ల మనోహర్ – ఆహారం,పౌరసరఫరాల శాఖ
5) వంగలపూడి అనిత – హోం మంత్రిత్వ శాఖ
6)పొంగూరు నారాయణ – పురపాలక శాఖ,పట్టణఅభివృద్ధి
7)సత్య కుమార్ యాదవ్ – ఆరోగ్యశాఖ
8)నిమ్మల రామానాయుడు – నీటిపారుదల శాఖ
9) మహమ్మద్ ఫారూఖ్ – మైనారిటీ,న్యాయ శాఖ
10) ఆనం నారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ శాఖ
11)పయ్యావుల కేశవ్ – ఆర్థిక శాఖ
12)అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ శాఖ
13) పార్థసారధి – హౌసింగ్,ఐ అండ్ పిఆర్ శాఖ
14) గొట్టిపాటి రవికుమార్ – విద్యుత్ శాఖ
మొత్తంగా 25 మందికి శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు.