ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..
నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,
నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…
ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావును
చూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ ఘోష నిన్ను ఏడేడు జన్మలు బాధ పెడుతుంది
అందరిలాగే భూమ్మీదికి వచ్చిన నువ్వు నలుగురికి మంచి చేయకున్నా పర్వాలేదు,నలుగురిని హాని చెయ్యకు నలుగురిని
దోచుకోకు..చరిత్ర తెలుసుకో ప్రజలను బాధపెట్టిన ఎంతటి వాడైనా సుఖంగా చచ్చినట్టు చరిత్రలో లేదు.ఇంకా మించిపోయింది
ఏం లేదు ఇప్పుడైనా మారు..
- కుమ్మరి రాజు