- చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు
- రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు
- అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించిన
పట్టించుకోని అధికారులు - దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు
- పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు
హైదరాబాద్ లో ఎంతో పేరుగాంచిన చిత్రపురి కాలనీను అవినీతిపరులు అక్రమాలు చేసి భ్రష్టు పట్టించారు.మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలకుల అసమర్థ వల్ల ప్రభుత్వ,ప్రజ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు అవినీతి పరులతో కుమ్మకై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు.తాజాగా చిత్రపురి కాలనీ అవినీతి బయటపడడంతో “చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు” గా మారింది కొంతమంది అధికారుల పరిస్థితి.అక్రమాలు,అవినీతి జరుగుతుంది సార్లు..!! స్పందించండి అంటే ఆనాడు చర్యలు తీసుకోకుండా అవినీతిపరులకు వత్తాసు పలుకుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి,ఎంతోమంది కన్నీటికి కారకులైతిరి.ఇప్పడు అదే అధికారులు జైలులో ఉచాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏంతోమంది కన్నీటికి కారణమైన చిత్రపురి అవినీతి కేసులో తవ్వేకొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంది.తాజాగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిల్ సెక్షన్ ల కింద 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.మరో వైపు ప్రెసిడెంట్ అనిల్ కుమార్,సెక్రెటరీ దొర మరియు కమిటీ పైన కూడా కొత్తగా ఐదు కేసులు నమోదు అయ్యాయి.వీటితో పాటు మరో నాలుగు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.రాజేంద్రనగర్ కోర్టు ద్వారా నిందితుల పై కేసులు నమోదు చేయించారు బాధితులు.కమీషనర్,డీసీవో,శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ లు చిత్రపురి కమిటీ తో కుమ్మకై అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి అని కొంతమంది సభ్యులు ముందే అధికారులను హెచ్చరించిన,కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినా ఆనాడు పట్టించుకోలేదని,దానికి ఫలితమే నేడు నమోదైన నాన్ బెయిలబుల్ కేసులని బాధితులు తెలిపారు.ఇప్పటికే 3 నుండి 4 కేసులు దాటాయి కాబట్టి పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ బాధితులు రాయిదుర్గం పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడుతూ,నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారుల పైన పాలకులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి కుంభకోణాలు జరిగాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.తాజాగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్రపురి అవినీతి కుంభకోణం బయటికి వచ్చింది.ఈ కేసులో ఇప్పటికే అనేక మంది పైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.అవినీతికి పాల్పడిన మరింతమంది పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.